VT ROYAL FOUNDATION
Happy to Announce
Dr. Kassireddy Venkateshwar Reddy
His dedication and kindness earned him a doctorate in social service from Day Spring Christian University(USA), highlighting his commitment to making the world a better place.
Registration Certificates
We are having the 80G & 12A certificates. Anyone can donate to our foundation and claim the Tax Benefits.
HELPING HANDS
శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మండేపు శాంతి కుమార్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన శాంతి కుమార్ కుటుంబ సభ్యులకు, Rs.5000/- వేల రూపాయలు మా VT ROYAL FOUNDATION తరపున ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది
గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో ఉండే S సురేందర్ రావు గారు గత నెల హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు ఆయనకు ఇద్దరు కుమర్తెలు ,ఆయన ఆకస్మిక మరణంతో పిల్లలు చదువు ఆపేసి పరిస్థితి వచ్చింది. స్థానికుల ద్వారా తెలుసుకొని ఈ రోజు ఒక అమ్మాయి S కావ్య శ్రీ కి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో Rs.40000/ వేల ఫీజును Rs 23,000(ఇరవై మూడు వేల) రూపాయలకు సంవత్సరానికి మాట్లాడి VT ROYAL FOUNDATION తరపునా ఆ అమ్మాయి చదువు కోసం స్కూల్లో కట్టడం జరిగింది
బాలాపూర్ కి చెందిన లాల్కోట మహేష్ కి ముగ్గురు సంతానం ,ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలు సాహితీ 8వ తరగతి, సౌమ్య 7వ తరగతి అబ్బాయి దీక్షిత్ 4వ తరగతి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు . ఈ రోజు మా సంస్థను ఆశ్రయించి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు VT ROYAL FOUNDATION తరపునా వారికి నోటు పుస్తకాలు ,పుస్తకాలు కవర్లు, లేబుల్స్, వారికి ఉపయోగపడే కొన్ని స్టేషనరీ వస్తువులు ఇవ్వడం జరిగింది
నా ఆప్తమిత్రుడు వినోద్ గారి బామ్మర్ధి నాగిల్ల గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా వాసి అయిన పాలకుర్ల శ్రీను గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్య వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ సహకారంతో జీవిస్తున్నాడు వినోద్ ద్వారా మన సంస్థ గురించి తెలుసుకొని పిల్లలు చదువు మరియు మెడికల్ కర్చుల కోసం అని ఫౌండేషన్ ను ఆశ్రయిస్తే VT ROYAL FOUNDATION తరపునా Rs.10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి నెల Rs 1500/- వందల రూపాయలు మందులు కొనుగోలు కోసం కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది
గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో నివసిస్తున్న మొగిలి రాజీవ్ కుమార్ కు ఇద్దరు కుమారులు, మొగిలి కార్తిక్ మరియు మొగిలి ఆదిత్య గాయత్రినగర్ లోని విజయశ్రీ హై స్కూల్ లో కార్తిక్ UKG ,ఆదిత్య LKG చదువుతున్నారు. గురువారం(06/07/2023) నాడు మా సంస్థను ఆశ్రయించి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఫౌండేషన్ తరపునా ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు ఈ రోజు వారి స్కూల్ వద్దకు వెళ్ళి VT ROYAL FOUNDATION తరపునా Rs.5000/- వేల రూపాయలు నగదు రూపెన ఇవ్వడం జరిగింది🫱🏻🫲🏻
నాగోల్ నివాసులు అయిన దాసరి శ్రీకాంత్ – సరిత దంపతులకు ఇద్దరు పిల్లలు దాసరి మనీష్ మరియు భవ్య శ్రీ బాగ్ లింగంపల్లి లోని నృపతుంగ హై స్కూల్ లో మనీష్ 9వ తరగతి భవ్యశ్రీ 8వ తరగతి చదువుతున్నారు. మా సంస్థను విచ్చేసి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఫౌండేషన్ తరపునా ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు VT ROYAL FOUNDATION తరపునా Rs.10,000/- వేల రూపాయలు నగదు రూపెన ఆర్థిక సహాయం చేయడం జరిగింది🫱🏻🫲🏻
మీర్పెట్ మునిసిపాలిటీ, బాలాపూర్ గ్రామంలో నివసిస్తున్న కుత్తడి మోహన్ కుమార్తె కుత్తడి స్నేహ గురు నానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బీ టెక్ మూడవ సంవత్సరం చదువుతుంది. ఈ రోజు మా సంస్థను ఆశ్రయించి తన తండ్రి ఆరోగ్యపరిస్థితి భాగొలేదని ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల ఫీజు కూడా చెల్లించడానికి కష్టంగా ఉంది అని ఫౌండేషన్ తరపున ఎదైన సహాయం కోరారు .వారి కోరిక మేరకు VT ROYAL FOUNDATION తరపునా Rs.10,000/-(పది వేల రూపాయలు) నగదు రుపెన ఇవ్వడం జరిగింది🫱🏻🫲🏻
గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో బడుగుల సుబ్రమణ్యం బుచ్చమ్మ అనే దంపుతులు చెప్పులు కుట్టుతారు వారికి సరైన షేడ్ లేక ఎండలో వారు ఇబ్బంది పట్టడం గమనించి నిన్న అనగా 15/12/2023 నాడు మా VT ROYAL FOUNDATION తరపున వారికి షేడ్ మరియు ఇతర చెప్పులు కుట్టడానికి కావలసిన సామగ్రి కోసం Rs.10,000/- వేల రూపాయలు నగదు రుపెన ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది🙏🏻
మా పాత కస్టమర్ అయిన P వినోద్ కుమార్ ఆటో నడిపిస్తూ జీవనం గడిపిస్తుండే కానీ ఇటీవల ఏక్సిడెంట్ జరిగి ఆటో పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. నిన్న మా ఫౌండేషన్ ని సంప్రదించి ఇట్టి విషయం చెప్పి ఎదైన సహాయం చేయమని కోరగా సెకండ్ హ్యాండ్ లో ఇంకో ఆటో కొనడానికి డౌన్ పేమెంట్ కి కావలసిన అమౌంట్ Rs.30000/-(అక్షరాల ముప్పై వేల రూపాయలు) మా *VT ROYAL FOUNDATION*తరపున చెక్ రూపేణ ఇవ్వడం జరిగింది🫱🏻🫲🏻